అన్నార్థులకు అండ..

ABN , First Publish Date - 2020-03-29T10:16:19+05:30 IST

కరోనా రాక్షసి దెబ్బకు రోజువారి కూలీలు, కార్మికుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. కొందరు తిండి కూడా

అన్నార్థులకు అండ..

కడప (సిటీ), మార్చి 28: కరోనా రాక్షసి దెబ్బకు రోజువారి కూలీలు, కార్మికుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. కొందరు తిండి కూడా దొరకని దుర్భర  పరిస్థితి నెలకొంది. అటువంటి వారికి తమకు తోచిన రీతిలో అండగా ఉండేందుకు కొందరు మానవతావాదులు ముందడుగు వేస్తున్నారు. తమ శక్తి కొలదీ భోజనం, బియ్యం, బేడలు పంపిణీ చేస్తూ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


రోజుకు 400 మందికి భోజనం

క్వాలిటీ ఎలకా్ట్రనిక్స్‌ అధినేత ఇస్మాయిల్‌ కొంత మంది స్నేహితులతో కలిసి పేదలకు భోజనం అందించేందుకు నడుం బిగించారు. సోమవారం నుంచి రోజుకు 400 మందికి తయారు చేసిన భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు. మిత్రులు ఐదు బృందాలుగా ఏర్పడి ఏ రోజుకారోజు నిర్ణయించుకున్న ఏరియాల్లో ఎంపిక చేసిన వారికి అందిస్తూ వస్తున్నారు. కాగా ఐ అండ్‌ పీఆర్‌ శాఖలో పనిచేస్తున్న సొహైల్‌ తన ద్విచక్ర వాహనంలో కూల్‌వాటర్‌ క్యాన్‌ పెట్టుకుని విధుల నిమిత్తం ఎండలో ఉంటున్న పోలీసు, మీడియా సిబ్బందికి తాగునీరందిస్తున్నారు.


నిత్యావసర వస్తువులందించడం అభినందనీయం : డీఎస్పీ

కరోనా వైరస్‌ వ్యాప్తి సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా పది కేజీల బియ్యం, కందిపప్పు, నూనె అందించడం అభినందనీయమని కడప డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు. కడప కువైట్‌ ముస్లిం అసోసియేషన్‌ మౌంటైన్‌ ఇండస్ట్రియల్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను నగరంలో తిరుగుతూ అందించారు. ముందుగా డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ చేతుల మీదుగా పలువురు పేదలకు నిత్యావసర సరుకులు అందించిన అనంతరం సాయిపేట, వక్కలపేట తదితర ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసర వస్తువులను అందించారు. కార్యక్రమంలో రహీం, అబిద్‌, సత్తార్‌, ఆలీ, మౌలానా, ఖాజా, కరీం, జిలానీ తదితరులు పాల్గొన్నారు.


అనాథలకు అన్నం పొట్లాల పంపిణీ

కడప (స్పోర్ట్స్‌), మార్చి 28: నగరంలోని యాచకులు, అనాథలకు కేకేవైజీఎస్‌, ప్రిన్స్‌ మహే్‌షబాబు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మౌలా ఆధ్వర్యంలో అన్నం పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీరు సందర్శిస్తూ అనాథలకు, యాచకులకు అన్నం పొట్లాలు పంపిణీ చేసి వారి ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా మౌలా మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి ప్రతిరోజూ వంద నుంచి 200 మంది వరకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పూర్ణ, ఫయాజ్‌, పండు తదితరులు పాల్గొన్నారు.


నిత్యావసర వస్తువుల పంపిణీ

 కడప నగరం 17వ డివిన్‌లోని అంధుల అనాథాశ్రమంలో ఉంటున్న 60 మంది అంధులకు స్థానిక వైసీపీ నాయకుడు చంద్రహాసరెడ్డి 10 రకాల నిత్యావసర వస్తువులను శనివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా సీఎంఆర్‌పల్లెలోని అనాథాశ్రమంలోని అంధులు నిత్యావసర వస్తువులు అందక ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో మట్టి శ్రీనివాసులరెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, డాక్డర్‌ చంద్రమౌళి, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


పేదలకు బియ్యం పంపిణీ

పట్టణంలోని పలువురు పేదలకు టీడీపీ మైనార్టీ యకుడు ఖాదర్‌బాషా బియ్యం పంపిణీ చేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పలువురికి మసూర బియ్యాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. దాదాపు వంద మందికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశానన్నారు. కార్యక్రమంలో దాది రామయ్య, ఖలీల్‌, నవీష్‌, షంషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T10:16:19+05:30 IST