జాతీయ లోక్‌ అదాలత్‌లో 398 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:17:03+05:30 IST

గద్వాల, అలంపూర్‌ కోర్టుల ఆవరణలో శనివారం జా తీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఇందులో 398 కేసులు పరిష్కారమయ్యా యి

జాతీయ లోక్‌ అదాలత్‌లో 398 కేసులు పరిష్కారం
గద్వాలలో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ అనీరోజ్‌ క్రిస్టియన్‌

గద్వాల క్రైం, ఆగస్టు 13 : గద్వాల, అలంపూర్‌ కోర్టుల ఆవరణలో శనివారం జా తీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.  ఇందులో 398 కేసులు పరిష్కారమయ్యా యి. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 365 కేసులు పరిష్కారం అయినట్లు  లోక్‌ అదాలత్‌  ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌,  మొదటి అదనపు జిల్లా జడ్జి అనీరోజ్‌ క్రిస్టియన్‌ తెలిపారు. ఇందులో సివిల్‌ కేసులు మూడు, మోటర్‌ వాహన ప్రమాద కేసులు రెండు, ఎక్సైజ్‌ కేసులు 55, బ్యాంక్‌ ఫ్రిలిటిగేషన్‌ కేసులు 305, ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి పరిష్కరించిన ట్లు జడ్జి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత కర్నాటి, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గాయత్రి, న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు.

అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో..

అలంపూరు: అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమలాపురం కవిత ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు జాతీయజెండాలను పంపిణీ చేశారు.  లోక్‌ అదాల త్‌లో భాగంగా 33 కేసుల్లో కక్షిదారులు రాజీపడ్డారని, ఇందుకుగాను అపరాధ రుసుము ద్వారా రూ.70వేలు కోర్టుకు వచ్చినట్లు లోక్‌ అదాలత్‌ ఇన్‌చార్జి సాయి తేజ తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, న్యాయ వాదులు వెంకట్‌రాములు, వెంకటేష్‌ ఉన్నారు.



Updated Date - 2022-08-14T05:17:03+05:30 IST