ఫీజులు డిమాండ్ చేస్తున్న 38 కాలేజీలకు షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2020-04-09T20:45:00+05:30 IST

లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. ఆ కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు

ఫీజులు డిమాండ్ చేస్తున్న 38 కాలేజీలకు షోకాజ్ నోటీసులు

పంజాబ్ : దాదాపు 38 ప్రైవేట్ కాలేజీలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గురువారం కొరడా ఝులిపించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. ఆ కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు విద్యామంత్రి విజయ్ ఇందర్ సింగ్లా తెలిపారు. ‘‘ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారం రోజుల్లోగా వారి స్పందన తెలియజేయాలి. సంతృప్తికర సమాధానాలు ఇవ్వకపోతే ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తాం’’ అని ఇందర్ సింగ్లా స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో రవాణా ఖర్చులతో పాటు పుస్తకాల ఫీజులను సైతం వసూలు చేయకూడదని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. 

Updated Date - 2020-04-09T20:45:00+05:30 IST