హోమ్‌ క్వారంటైన్‌కు 3,720 మంది గుర్తింపు

ABN , First Publish Date - 2020-03-29T11:04:01+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా ఉండేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వరకు విదేశాల నుంచి వచ్చినవారికి హోమ్‌ క్వా రంటైన్‌లో ఉంచేవారు.

హోమ్‌ క్వారంటైన్‌కు  3,720 మంది గుర్తింపు

రాయదుర్గం, మార్చి 28 : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా ఉండేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వరకు విదేశాల నుంచి వచ్చినవారికి హోమ్‌ క్వా రంటైన్‌లో ఉంచేవారు. తాజాగా వైరస్‌ వ్యాప్తి వేగవంతంగా జ రుగుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సై తం గుర్తించి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించి గ్రామాల్లో ఇటీవల వచ్చిన వారందరినీ గుర్తించే ప్రక్రియను శనివారం ఉదయం నుంచి క సరత్తు చేసి నియోజకవర్గంలో 3,720 మంది ఉన్నట్లు తేల్చారు.


వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌ తెలిపిన వివరాల మేరకు నియోజకవర్గంలోని రాయదుర్గం పట్టణంలో 420 మంది, మండలంలో 900 మంది, కణేకల్లు మండలంలో 620 మంది, బొమ్మనహాళ్‌ మండలంలో 350 మంది, డీ హీరేహాళ్‌ మండలంలో 500 మం ది, గుమ్మఘట్ట మండలంలో 600 మంది దాకా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఉపాధి కోసం వెళ్లిన కూలీలతో పాటు వివిధ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో వారందరినీ హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు రెవెన్యూ యంత్రాంగంతో కలసి వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చే సేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయదుర్గం మో డల్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన వంద పడకల క్వారంటైన్‌ కేం ద్రంలో 24 గంటల పాటు విధులు నిర్వహించేందుకు ముగ్గురు వైద్యులతో పాటు ఆరుగురు నర్సులను నియమించారు. 


 30 మంది ప్రయాణికులు నైట్‌ షెల్టర్‌కు తరలింపు

గుంతకల్లుటౌన్‌, మార్చి28: పట్టణంలోని మోదినాబాద్‌లో చెట్ల కింద ఉన్న స్వస్థలం చేరుకోలేని 30 మంది ప్రయాణికుల ను మహిళా సంరక్షణ కార్యదర్శి పుష్యమి శనివారం మున్సిపాలి టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైట్‌ షెల్టర్‌కు తరలించారు. కార్యక్రమంలో వాలంటీర్ల మధు, నీలకంఠ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T11:04:01+05:30 IST