Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ యువకుడిని అంతా రియల్ హీరో అంటున్నారు.. కారణం తెలిస్తే మీరూ శభాష్ అనకుండా ఉండలేరు..

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్‌కు చెందిన 35 ఏళ్ల యువకుని ధైర్యసాహసాల ముందు ఆ దొంగలు నిలువలేకపోయారు. రాత్రివేళ ఆయుధాలతో సహా చొరబడిన ఆ దొంగలు యువకుని ఎదురుదాడికి తట్టుకోలేకపోయారు. కనీసం ప్రాణాలనైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ఆ యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనంతా సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ సంగతి తెలిసిన గ్రామస్తులు తమకు రక్షణ కొరవడిందంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. 

వివరాల్లోకి వెళితే ముల్ముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణ్‌పత్ సాహూ కిరాణా దుకాణం నిర్వహిస్తూ, అదేప్రాంతంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఏదో శబ్ధం వినగానే ఇంటిలోని వారంతా నిద్రలేచారు. ఇంటిలోకి ఇద్దరు దొంగలు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు గుర్తించారు. వెంటనే గణపత్ సాహూ కుమారుడు రాజేష్ ఇంటి తలుపులు తెరిచాడు. వెంటనే ఆ దొంగలు ఇంటిలోనికి దూరే ప్రయత్నం చేశారు. రాజేష్ ఒక్కడే ఒక దొంగను అడ్డుకున్నాడు. అయితే ఇంతలో మరో దొంగ రాజేష్‌పై దాడికి ప్రయత్నించాడు. అయితే రాజేష్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వారిపై ఎదురుదాడి చేస్తూ వచ్చాడు. దీనిని ఎదుర్కోలేక ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement