నగర పాలక సంస్థకు రూ.33 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2020-06-01T09:47:15+05:30 IST

ఆస్తిపన్ను వసూళ్లలో భాగంగా నగర పాలక సంస్థకు ఆదా యం సమకూరింది. పా త బకాయిలతో పాటు రిబేట్‌ బకాయిలు వసూలయ్యాయి.

నగర పాలక సంస్థకు రూ.33 కోట్ల ఆదాయం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 31: ఆస్తిపన్ను వసూళ్లలో భాగంగా నగర పాలక సంస్థకు ఆదా యం సమకూరింది. పా త బకాయిలతో పాటు రిబేట్‌ బకాయిలు  వసూలయ్యాయి. పూర్వ బకాయిలు రూ.29 కోట్ల కుగానూ, రూ.28.5 కోట్లు వసూలైంది. రిబేట్‌ కింద రూ.4.5 కోట్ల ఆదాయం వచ్చింది. నగర కమిషనర్‌ ప్రత్యేక చొరవతో పాటు ఆస్తిపన్నుకు 5 శాతం రిబేట్‌ ఇవ్వడంతో భారీగా వసూలయ్యాయి. 


ముందస్తు ట్యాక్స్‌ చెల్లించిన ధన్‌పాల్‌ సూర్యనారాయణ

ఆస్తిపన్ను చెల్లింపులో భాగంగా 2020-21 సంవత్సరానికిగానూ ముందస్తు గా కిసాన్‌ క్లాత్‌ ఎంపోరియానికి సంబంధించిన రూ.7.96 లక్షల ఆస్తిపన్నును షాపు యజమాని ధన్‌పాల్‌ సూర్యనారాయణ చెల్లించారు. ఈ మేరకు  ఆది వారం నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌కు చెక్కును అందజేశారు.

Updated Date - 2020-06-01T09:47:15+05:30 IST