3,117 మంది విదేశీ మైనారిటీలకు పౌరసత్వం: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-22T21:51:39+05:30 IST

సిటిజన్ షిప్ యాక్ట్ (సీఏఏ)కు సంబంధించిన నిబంధనలను భారత ప్రభుత్వం ఇంకా రూపొందించాల్సి ఉన్నప్పటికీ..

3,117 మంది విదేశీ మైనారిటీలకు పౌరసత్వం: కేంద్రం

న్యూఢిల్లీ: సిటిజన్ షిప్ యాక్ట్ (సీఏఏ)కు సంబంధించిన నిబంధనలను భారత ప్రభుత్వం ఇంకా రూపొందించాల్సి ఉన్నప్పటికీ విదేశీ మైనారిటీ శరణార్ధులకు గణనీయంగానే భారత పౌరసత్వం కల్పించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆప్ఘనిస్థాన్‌, పాక్, బంగ్లాదేశ్‌కు చెందిన 3,117 మంది మైనారిటీలకు ఈదేశ పౌరసత్వం కల్పించినట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2018 నుంచి ఇంతవరకూ భారత పౌరసత్వం పొందిన వారి గణాంకాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు బుధవారంనాడు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. 2018 నుంచి 2021 వరకూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌ దేశాల హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ గ్రూపులకు చెందిన 8,244 మంది భారత పౌరసత్వం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వీరిలో ఇప్పటి వరకూ 3,117 మందికి భారత పౌరసత్వం కల్పించామని చెప్పారు.

Updated Date - 2021-12-22T21:51:39+05:30 IST