జిల్లాలో కరోనా విలయ తాండవం

ABN , First Publish Date - 2020-07-12T10:13:36+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టించింది. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ

జిల్లాలో కరోనా విలయ తాండవం

ఒక్కరోజే  311 మందికి పాజిటివ్‌

మూడు వేలు దాటిన బాధితుల సంఖ్య 

23కి చేరిన మరణాలు



అనంతపురం వైద్యం, జూలై 11: జిల్లాలో కరోనా కల్లోలం సృష్టించింది. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్క రోజులో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో మొత్తం 3161 పాజిటివ్‌ కేసులతో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో ఉన్న కర్నూలు జిల్లాకి కేవలం 7 కేసుల దూరంలో ఉండటం గమనార్హం. జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో అధికార యంత్రాంగం బెంబేలెత్తిపోతోంది. బాధితులకు అవసరమైన వసతులు, వైద్య సేవలందించలేకపోతున్నారు. కరోనాతో శనివారమూ ఒకరు మరణించటంతో మృతుల సంఖ్య 23కి పెరిగింది. ఈ పది రోజుల్లోనే 15 మంది  చనిపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడి 1821 మంది కోలుకోగా.. మిగతావారు  వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


బాధితుల తరలింపుపై తర్జనభర్జన

కరోనా బాధితుల తరలింపుపై యంత్రాంగంలో తర్జన భర్జన మొదలైంది. తొలిరోజుల్లో కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదైనపుడు బాధితులను ఆస్పత్రికి సక్రమంగా, సకా లంలో 108 వాహనాల్లో తరలించి, చికిత్సలు అందేలా చూ సేవారు. మే నెల వరకూ బాధితుల తరలింపుపై అధికా రులు తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత కేసులు అమాంతం పెరగటంతో బాధితుల తరలింపు అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో తొలినుంచి 108 వాహనాలు 13 ఉపయోగించుకుంటున్నారు. నేటికీ వీటినే వినియోగిస్తున్నారు. కేసులు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ పదింతలు పెరిగాయి. వాహనాలు తక్కువగా వినియోగిస్తుండటంతో కరోనా పాజిటివ్‌ బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించలేకపోతున్నారు.


ఒక్కోసారి ఒకట్రెండు రోజులు పాజిటివ్‌ బాధితులు 108 వాహనం కోసం ఇళ్ల వద్దనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఆయా ప్రాంతాలకు చెందిన ఐదారుగురిని గుర్తించి, అందరినీ అదే వాహనంలోనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇటీవల బాధితుల తరలింపును అధికారులు పూర్తిగా విస్మరించారు. పాజిటివ్‌ బాధితులను హోం క్వారంటైన్‌లోనే ఉంచేస్తున్నారు. అది కూడా వారికి చెప్పా పెట్టకుండా ఇంటివద్దనే వదిలేస్తున్నారు. దీంతో  బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ కుటుంబ సభ్యులతో జీవనం గడపాల్సి వస్తోంది.  ప్రస్తుతం ఒక్కరోజే 300కు పైగా కేసులు రావటంతో వారందరినీ ఎక్కడికి తరలించాలనే విషయంలో అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది.


ఆస్పత్రుల్లో బెడ్లు కరువు

కరోనా బాధితులకు చికిత్స అందించే కొవిడ్‌-19 ఆస్ప త్రుల్లో బెడ్లు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎస్కేయూ, జేఎన్‌టీయూ, జిల్లా సర్వజనాస్పత్రి, హిందూ పురం ప్రభుత్వాస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, జిల్లా కేం ద్రంలో నారాయణ జూనియర్‌ కళాశాల, వివేకానంద జూనియర్‌ కళాశాల హాస్టళ్లలో కరోనా చికిత్స విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు పాజిటివ్‌ బాధితులను తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.


ఇప్పటికే వందలాది మంది బాధితులు ఆయా కేంద్రాల్లో ఉంటున్నారు. జిల్లా సర్వజనాస్పత్రిలో కేవలం 150 మందికి అవసరమైన వసతులున్నాయని చెబుతున్నారు. ఇందులో కూడా 70 నుంచి 80 మందికి మాత్రమే బెడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో 150 మందివరకూ వైద్యసేవలు అందించే అవకాశముంది. ఎస్కేయూలో మా త్రం 100 మందికే అవకాశం. జేఎన్‌టీయూ, నారాయణ, వివేకానంద కళాశాలలో 50 నుంచి 100లోపే బెడ్లు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. 1317 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు బులెటిన్‌లో చూపుతున్నారు. ఇందులో కొందరు హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన చూసినా శనివారం కొత్తగా నమోదైన 311 మంది బాధితులను ఆస్పత్రులకు తరలించటం ఎలా అనే దానిపై ఇప్పుడు తర్జనభర్జన సాగుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారు మాత్రం తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో పడిపోతు న్నారు.


ఇంటి వద్దకే కిట్‌ సరఫరాకు చర్యలు

జిల్లా అధికారులు కరోనా బాధితులను ఆస్పత్రులకు త రలించే విషయంలో దాదాపు చేతులెత్తేస్తున్నట్లు  కనిపి స్తోంది. హోం క్వారంటైన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సైతం కరోనా పాజిటివ్‌ బాధితులకు ఇళ్ల వద్దే వైద్యసేవలు అందిస్తామని పదేపదే చెబుతోంది. అదే నిర్ణయాలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే హోం క్వారంటైన్‌లో ఉండేలా కరోనా బాధితులకు అవగాహన కల్పిస్తున్నారు.


వారికి హోం క్వారంటైన్‌ కిట్‌లు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇంటివద్దనే ఉంటే పల్స్‌ లాక్వీమీటర్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ మందులు శానిటైజర్లు, లిక్విడ్‌ సోప్‌లు, హైపోక్లోరైడ్‌, సర్జికల్‌ మాస్కులతోపాటు అవసరమైన మందుల కిట్టును అందించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు.. పా జిటివ్‌ బాధితులకు వివరిస్తూ ఇంటి వద్దనే ఉంటూ వైద్య సేవలు పొందేలా చూస్తున్నారు.

Updated Date - 2020-07-12T10:13:36+05:30 IST