Stone statues: 300 ఏళ్లనాటి ప్రాచీన విగ్రహాల స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-05T15:06:45+05:30 IST

స్థానిక ప్యారీస్‏లో విదేశాలకు తరలించేందుకు దాచిన 300 ఏళ్ల(300 years old)నాటి ప్రాచీన రాతి విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్యారీస్‌

Stone statues: 300 ఏళ్లనాటి ప్రాచీన విగ్రహాల స్వాధీనం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 4: స్థానిక ప్యారీస్‏లో విదేశాలకు తరలించేందుకు దాచిన 300 ఏళ్ల(300 years old)నాటి ప్రాచీన రాతి విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్యారీస్‌ పిడారియార్‌ ఆలయ వీధికి చెందిన విగ్రహాల స్మగ్లర్‌ ఇమ్మానుయేల్‌ ఫినిరో కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆయన ఇంట్లో పురాతన విగ్రహాలున్నట్లు విగ్రహాల స్మగ్లింగ్‌ నిరోధక విభాగం డీజీపీ జయంతి మురళికి సమాచారం అందింది. ఆ ఇంట్లో ఇమ్మానుయేల్‌(Emmanuel) భార్య మాత్రమే ఉంటోంది. ఐజీ దినకరన్‌ నేతృత్వంలోని పోలీసులు ఆ ఇంట్లో బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఓ రహస్య గదిలో దాచిన దక్షిణా మూర్తి, మురుగన్‌, వల్లి, దేవసేన, అమ్మన్‌, శనీశ్వరుడు వంటి 9 రాతి విగ్రహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాలు 300 ఏళ్లనాటివని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-05T15:06:45+05:30 IST