ఫ్రాన్స్, బ్రిటన్‌లలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-28T12:23:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. మృతుల సంఖ్య 10 లక్షలకు చేరువగా అంటే 9.99 లక్షలు దాటింది. కరోనా మహమ్మారి బారిన పడిన 2.44 కోట్ల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 76.49 లక్షల...

ఫ్రాన్స్, బ్రిటన్‌లలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. మృతుల సంఖ్య 10 లక్షలకు చేరువగా అంటే 9.99 లక్షలు దాటింది. కరోనా మహమ్మారి బారిన పడిన 2.44 కోట్ల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 76.49 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 65,393 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదే సమయంలో ఫ్రాన్స్‌లో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారం రోజలు వ్యవధిలో 13 వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం మరోమారు లాక్ డౌన్ విధించాలని భావిస్తుండగా, ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 


ఇదేవిధంగా బ్రిటన్‌లో కూడా ప్రతీరోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్ ప్రజలు కూడా లాక్‌డౌన్ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జూన్ ఐదు తరువాత మరోమారు తాజాగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవలే విద్యాసంస్థలను, మార్కెట్లను తెరిచిన కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇక చైనాలోనూ రెండువారాల తరువాత కొత్తగా 14 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా సోకినట్లు గుర్తించారు. 


Updated Date - 2020-09-28T12:23:11+05:30 IST