బర్డ్ ఫ్లూ : మహారాష్ట్రలో మరో 289 పక్షులు మృత్యువాత

ABN , First Publish Date - 2021-01-27T02:34:46+05:30 IST

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతున్న వేళ సోమవారం మరో 289 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మరణించిన...

బర్డ్ ఫ్లూ : మహారాష్ట్రలో మరో 289 పక్షులు మృత్యువాత

ముంబై: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతున్న వేళ సోమవారం మరో 289 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మరణించిన పక్షుల సంఖ్య 18,700కి పెరిగినట్టు అధికారులు ఇవాళ వెల్లడించారు. మృతి చెందిన పక్షులకు బర్డ్ ఫ్లూ సోకిందా లేదా అన్నది తేల్చేందుకు వాటి నమూనాలను భోపాల్‌ లేబొరేటరీకి పంపామని పేర్కొన్నారు. ‘‘ఈ 289 పక్షుల్లో 260 వరకు కోళ్లు ఉండగా.. మిగతా వాటిలో కొంగలు, చిలుకలు, కాకులు మొదలైనవి ఉన్నాయి..’’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ ప్రభావం పడిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 51,090 కోళ్లు, ఎనిమిది బాతులు, 38,798 గుడ్లు, 55,476 కేజీల దాణాను ధ్వంసం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-27T02:34:46+05:30 IST