దేశంలో 2,635 కరోనా పాజిటీవ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-03T19:25:05+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,635కు చేరింది.

దేశంలో 2,635 కరోనా పాజిటీవ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,635కు చేరింది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లినవారందరికీ వైద్య పరీక్షలు చేస్తుండడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైరస్ కారణంగా 14 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 73కు చేరింది. తాజాగా ఢిల్లీలో ఇద్దరు నర్సులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 293కు చేరింది. స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో వైరస్ సోకిన ఇద్దరు డాక్టర్లనుంచి వారికి వ్యాపించినట్లు నిర్ధారించారు.


రాజస్ధాన్‌లో మరో 14 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో రాజస్థాన్‌లో కేసుల సంఖ్య 154కు చేరింది. గోవాలో మరో పాజిటీవ్ కేసు నిర్ధారణ అయింది. దీంతో గోవాలో మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. తాజాగా బయటపడిన కేసులో ఆ వ్యక్తి కెన్యా, మొజాంబిక్ వెళ్లి వచ్చాడని గోవా ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కేసులు అధికంగా 20 హాట్‌‌స్పాట్‌లను కేంద్రం గుర్తించింది. వాటితో పాటు ఆ ముప్పు ఎక్కువగా ఉన్న మరో 22 ప్రాంతాలను హాట్‌‌స్పాట్‌లుగా గుర్తించింది. ఢిల్లీలో తబ్లిగ్ జమాత్ ప్రార్థనలు జరిగిన నిజాముద్దీన్ దర్గా ప్రాంతం, రాజస్ధాన్‌లో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన దిల్‌వారా ప్రాంతాన్ని హాట్‌‌స్పాట్‌గా ప్రకటించింది. 

Updated Date - 2020-04-03T19:25:05+05:30 IST