ట్రిపుల్‌ఐటీల్లో 2561 సీట్లు భర్తీ

ABN , First Publish Date - 2021-11-28T04:53:02+05:30 IST

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కౌన్సిలింగ్‌లో నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంప్‌సలకు కలిపి ఇప్పటి వరకు 2561 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.

ట్రిపుల్‌ఐటీల్లో 2561 సీట్లు భర్తీ
అడ్మిషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డైరెక్టర్‌ సంధ్యారాణి

వేంపల్లె, నవంబరు 27: ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కౌన్సిలింగ్‌లో నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంప్‌సలకు కలిపి ఇప్పటి వరకు 2561 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. 3000 ర్యాంకు వరకు విద్యార్థులకు ఆహ్వానం పంపగా ఇందులో 439 మంది గైర్హాజరయ్యారు. ఈనెల 24వ తేదీ ప్రారంభమైన కౌన్సిలింగ్‌ 4వ రోజు 2000 ర్యాంక్‌ నుంచి 3 వేల ర్యాంక్‌ వరకు విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపగా నాలుగు క్యాంప్‌సలలో 856 మంది విద్యార్థులు అడ్మిషన్‌ పొందారు. 144 మంది విద్యార్థులు శనివారం గైర్హాజరయ్యారు. డైరెక్టర్‌ సంద్యారాణి పర్యవేక్షణలో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అడ్మిషన్‌ ప్రక్రియ జరుగుతోంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని డైరెక్టర్‌ తెలిపారు. 


 లెక్చరర్‌ పోస్టులకు ట్రిపుల్‌ఐటీ అధ్యాపకులు


మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ పాత క్యాంప్‌సలో కొనసాగుతున్న ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో పనిచేసే అధ్యాపకులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ విడుదల చేయగా రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచి అధ్యాపకులుగా ఎంపికయ్యారు. గణిత విభాగంలో సాంబశివుడు, కెపి వర్మ, కెమిస్ర్టీ విభాగంలో నాగన్న, ఫిజిక్స్‌ విభాగంలో శ్రీకాంత్‌లు ఎంపికయ్యారని ఒంగోలు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ జయరామిరెడ్డి తెలిపారు. 15 రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో వీరు లెక్చరర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిని ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-11-28T04:53:02+05:30 IST