పాపం.. మూడున్నరేళ్ల చిన్నారి అమాయకత్వానికి.. 23 రోజుల చిన్నారి..

ABN , First Publish Date - 2020-02-14T18:06:46+05:30 IST

మూడున్నరేళ్ల చిన్నరి అమాయకత్వానికి 23 రోజుల చిన్నారి ప్రాణం..

పాపం.. మూడున్నరేళ్ల చిన్నారి అమాయకత్వానికి.. 23 రోజుల చిన్నారి..

సంజామల(కర్నూలు): మూడున్నరేళ్ల చిన్నారి అమాయకత్వానికి 23 రోజుల చిన్నారి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆర్. లింగందిన్నెలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సత్తార్, ఖైరున్ దంపతుల కుమార్తె షఫీనాను ముక్కమళ్ల గ్రామానికి చెందిన సాధిక్ హుస్సేన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పెద్దకుమార్తె సోఫియాకౌసర్, చిన్న కుమార్తె 23 రోజుల చిన్నారి వుమ్మెసల్మా ఉన్నారు. షఫీనా ఇటీవల ప్రసవం కోసం తల్లి ఇంటికి వచ్చింది. అమ్మమ్మ ఖైరున్ ఊయలలో వుమ్మె సల్మాను నిద్రపుచ్చి భోజనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఇంతలో మూడున్నరేళ్ల సోఫియాకౌసర్ ఊయలలో ఉన్న పాప వుమ్మె సల్మాను ఆడిస్తూ స్నానం చేయిస్తానంటూ నీటి గచ్చు వద్దకు తీసుకెళ్లి గచ్చులో పడేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. సీఐ సుబ్బరాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-14T18:06:46+05:30 IST