22 కోట్ల ఆహార పొట్లాలు, 5 కోట్ల మోదీ కిట్లు ఇచ్చాం: నడ్డా

ABN , First Publish Date - 2020-07-05T00:20:47+05:30 IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో బీజేపీ కార్యకర్తలు 22 కోట్ల ఆహార పొట్లాలు, 5 కోట్ల మోదీ రేషన్ కిట్లు పంచినట్టు ..

22 కోట్ల ఆహార పొట్లాలు, 5 కోట్ల మోదీ కిట్లు ఇచ్చాం: నడ్డా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో బీజేపీ కార్యకర్తలు 22 కోట్ల ఆహార పొట్లాలు, 5 కోట్ల మోదీ రేషన్ కిట్లు పంచినట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారంనాడు జరిగిన 'సేవా హై సంఘటన్' కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ, పీఎం కేర్స్ ఫండ్‌కు కంటిబ్యూషన్ చేయాలంటూ 59 లక్షల మంది ప్రజలను పార్టీ కార్యకర్తలు ప్రోత్సహించినట్టు చెప్పారు.


లాక్‌డౌన్ కాలంలో పార్టీ సుమారు 4,000 వీడియా కాన్ఫరెన్స్‌లు నిర్వహించి 2.5 లక్షల మంది కార్యకర్తలకు చేరువైందని చెప్పారు. ఇవన్నీ వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చేపట్టినట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పేయింగ్ గెస్టులుగా ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల పిల్లలు అద్దెలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బీజేపీ కార్యకర్తలు వారితో మాట్లాడి వారికి బస కల్పించారని నడ్డా తెలిపారు.


మోదీ పోరాటం ప్రశంసనీయం..

కోవిడ్-19పై మోదీ నాయకత్వంలో చేసిన పోరాటం ప్రశంసనీయమని నడ్డా అన్నారు. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసిందని అన్నారు. కోవిడ్‌పై ప్రధాని పటిష్టమైన పోరాటం చేయడంతో పాటు పార్టీకి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.


కాగా, ప్రధాని మోదీ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కరోనా సంక్షోభంలో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన సహాయక చర్చలను సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T00:20:47+05:30 IST