ఉద్యోగం కోసం వెతికీ.. వెతికీ అలసిపోయిన 21ఏళ్ల యువకుడు.. Internetలో ఆ ఆర్టికల్ చూసి కీలక నిర్ణయం.. అతడు చేసిన పని నెట్టింట వైరల్!

ABN , First Publish Date - 2022-07-03T17:20:14+05:30 IST

ఒకప్పటితో పోల్చితే.. ప్రస్తుతం అందరూ చదువు ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నారు. చదువుకోవడం ద్వారానే జీవతం బాగుపడుతుందని భావించి.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో జాబ్ మార్కెట్‌లో విపరీతంగా పోటీ పెరి

ఉద్యోగం కోసం వెతికీ.. వెతికీ అలసిపోయిన 21ఏళ్ల యువకుడు.. Internetలో ఆ ఆర్టికల్ చూసి కీలక నిర్ణయం.. అతడు చేసిన పని నెట్టింట వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పటితో పోల్చితే.. ప్రస్తుతం అందరూ చదువు ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నారు. చదువుకోవడం ద్వారానే జీవతం బాగుపడుతుందని భావించి.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో జాబ్ మార్కెట్‌లో విపరీతంగా పోటీ పెరిగింది. కరోనా కూడా దీనికి తోడవటంతో.. చదువుకున్న వారందరికీ.. ప్రైవేటు రంగాల్లో సైతం ఆశించిన జాబ్‌లు దొరకడం గగనంగా మారిపోయింది. ఈ క్రమంలో 21ఏళ్ల యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగం ప్రయత్నంలో అలసిపోయిన ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. దీంతో అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



జార్జ్ కోర్నియాక్ అనే 21ఏళ్ల యువకుడు.. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన ఓ కాలేజీలో ఎకనామిక్స్ చదువుతున్నాడు. బ్యాంకింగ్, ఇన్సురెన్స్ కంపెనీల్లో పని చేసి.. అందులో అనుభవం పొందాలని అతడు భావించాడు. ఈ క్రమంలోనే జాబ్ కోసం అతడు దాదాపు 20 సంస్థలను సంప్రదించాడు. అయితే అక్కడ అతడికి నిరాశ ఎదురైంది. వెళ్లిన ప్రతి చోటా అతడు రిజెక్ట్ అవుతుండటంతో వినూత్నంగా ఆలోచించాడు. తన రెస్యూమ్‌ను QR codeలో పొందుపరిచి.. కంపెనీ గోడలకు అతికించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో అతడి సీవీకి సంబంధించిన QR code‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 


దీనిపై జార్జ్ స్పందిస్తూ.. ఎవరైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. తన రెస్యూమ్‌తోపాటు లింక్‌డిన్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుందన్నారు. అయితే ఇది తనకు స్వతహాగా వచ్చిన ఆలోచన కాదని చెప్పాడు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి జాబ్ కోసం ఇలానే ట్రై చేసినట్టు ఇంటర్నెట్‌లో చూసి, తనను ఫాలో అయినట్టు చెప్పాడు. జాబ్ వస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 


Updated Date - 2022-07-03T17:20:14+05:30 IST