అమెరికా యుద్ధ నౌకలో భారీ పేలుడు..!

ABN , First Publish Date - 2020-07-13T14:13:26+05:30 IST

అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ బాన్‌హోమ్ రిచర్డ్‌లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది.

అమెరికా యుద్ధ నౌకలో భారీ పేలుడు..!

శాన్‌డియాగో: అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ బాన్‌హోమ్ రిచర్డ్‌లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది. సాండియాగో నావికాదళ స్థావరంలో నిలిపి ఉన్న ఆ నౌకలో ఉదయం 9 గంటలకు భారీ పేలుడు జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని  నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 21 మంది సిబ్బంది, పౌరులు గాయపడ్డారన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయమేది సంభవించలేదని వెల్లడించారు. కాగా.. ప్రమాద సమయంలో నౌకలో సాధారణ మెయింటెనెన్స్ పనులు జరగుతున్నట్టు తెలిసింది. పేలుడు సంభవించినప్పుడు దాదాపు 160 మంది సిబ్బంది నౌకలో ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే గాయపడిన సిబ్బందికి ప్రాణాపాయం లేకపోవడం పట్ల చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ మైకీ గిల్డే హర్షం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో వేగంగా స్పందించి సిబ్బందిని రక్షించిన నౌకదళ స్థావరం సిబ్బంది, స్థానిక అగ్నిమాపక దళానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రమాదం వెనుక గల కారణాలు తెలుకునేందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

Updated Date - 2020-07-13T14:13:26+05:30 IST