21మంది కరోనా పేషెంట్ల డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-07-04T20:36:54+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న 21మంది పేషెంట్లను శుక్రవారం డిశ్చార్జి చేశారు.తిరుపతిలోని రుయా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 9మంది డిశ్చార్జి కాగా వీరిలో పాడిపేటకు చెందిన పదకొండు రోజుల చిన్నారి కూడా ఉంది

21మంది కరోనా పేషెంట్ల డిశ్చార్జి

తిరుపతి (వైద్యం): కరోనా నుంచి కోలుకున్న 21మంది పేషెంట్లను శుక్రవారం డిశ్చార్జి చేశారు.తిరుపతిలోని రుయా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 9మంది డిశ్చార్జి కాగా వీరిలో పాడిపేటకు చెందిన పదకొండు రోజుల చిన్నారి కూడా ఉంది. స్విమ్స్‌లోని శ్రీపద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న 12 మందిని డిశ్చార్జి చేశారు. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన పది మంది, కడప, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 210 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన 3 వేల మందికి శుక్రవారం శ్వాబ్‌ తీసి స్విమ్స్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపామన్నారు. 


క్యాన్సర్‌ బాధితురాలికి కరోనా 

రామకుప్పం : రామకుప్పం మండలం కెంచనబల్ల గ్రామానికి చెందిన క్యాన్సర్‌ బాధితురాలి (44)కి కరోనా సోకిందని విజలాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి అల్తాఫ్‌హుస్సేన్‌, తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు.  


31వరకు సినిమా థియేటర్ల మూత

చిత్తూరు కలెక్టరేట్‌ : కరోనా కారణంగా జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు జేసీ మార్కొండేయులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-07-04T20:36:54+05:30 IST