గస్తీకి 20 వాహనాలు

ABN , First Publish Date - 2022-01-14T17:35:47+05:30 IST

కొత్తగా ఏర్పాటైన ఆవడి, తాంబరం పోలీసు కమిపనర్‌ కార్యాలయాల పరిధిలోని పోలీసుల కోసం ప్రత్యేక గస్తీ వాహనాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. శాసనసభలో పోలీసు శాఖల ఆర్థిక పద్దులపై

గస్తీకి 20 వాహనాలు

                - జెండా ఊపి ప్రారంభించిన CM Stalin


చెన్నై: కొత్తగా ఏర్పాటైన ఆవడి, తాంబరం పోలీసు కమిపనర్‌ కార్యాలయాల పరిధిలోని పోలీసుల కోసం ప్రత్యేక గస్తీ వాహనాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. శాసనసభలో పోలీసు శాఖల ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల సందర్భంగా చెన్నై పోలీసు కమిషనరేట్‌ మినహా తక్కిన అన్ని నగరాల్లోని పోలీసు కమిషనరేట్ల పరిధిలో అవసరాలకు రూ.10 కోట్లతో 106 గస్తీ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.76 కోట్లతో 106 వాహనాల కొనుగోలుకు ఉత్తర్వులిచ్చింది. తొలి విడతగా కొత్తగా ఏర్పాటైన ఆవడి, తాంబరం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల ఉపయోగం కోసం 20 వాహనాలను కొనుగోలు చేశారు. సచి వాలయం వద్ద ఈ వాహనాలను స్టాలిన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్ముడి, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్కే ప్రభాకర్‌, రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబు, ప్రజాపనులశాఖ కార్యదర్శి డి.జగన్నాధన్‌, తాంబరం పోలీసు కమిషనర్‌ ఎం.రవి, ఆవడి పోలీసు కమిషనర్‌ సందీ్‌పరాయ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-14T17:35:47+05:30 IST