జహంగీర్‌పురి ఘర్షణ కేసులో 20 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-18T03:05:50+05:30 IST

శనివారం రాత్రి హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. మొత్తం 14 మంది గాయాలపాలయ్యారు. బాధితుల్లో పోలీసుల సంఖ్యే అధికంగా ఉన్నారు..

జహంగీర్‌పురి ఘర్షణ కేసులో 20 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: హనుమాన్ జయంతిన దేశ రాజధానిలోని జహంగీర్‌పూరిలో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ దేపేంద్ర పాఠక్ తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండడంతో వారిని జూవైనల్ హౌస్‌కు పంపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. అలాగే మూడు దేశీయ తుపాకులు, ఐదు తల్వార్లు సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరమే వారిని ఢిల్లీలోని రోహిణి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.


శనివారం రాత్రి హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. మొత్తం 14 మంది గాయాలపాలయ్యారు. బాధితుల్లో పోలీసుల సంఖ్యే అధికంగా  ఉన్నారు. కాగా, ఘర్షణ జరిగిన ప్రాంతంలో పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. తగిన స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్టు చెప్పారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఎలాంటి ఢోకా ఉండదని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ ఘటనపై సవ్యమైన దిశలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

Updated Date - 2022-04-18T03:05:50+05:30 IST