ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-05T01:42:32+05:30 IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ

ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే వైరస్ సోకిన వారిని క్వారెంటైన్‌లో ఉంచామని.. వారితో ఉన్న వారి గురించి కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్పారు. 


కేవలం ఐదు కిలోమీటర్ల విస్తీరణం ఉన్న ఈ ప్రాంతంలో లక్షలాది మంది జీవనం గడుపుతుంటారు. దీంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం చాలా కష్టతరమైన విషయం. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి సులభంగా సోకే కరోనా వైరస్ ఈ ప్రాంతంలో సులభంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇక్కడ పకడ్బందీగా వైద్య సేవలు అందించేందుకు అధికారులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మృతి చెందాడు. దీంతో మిగితావారికి ఈ వ్యాధి సోకకుండా ఏర్పాట్లు చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.


ఇప్పటికే ముంబైలో 420 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. 

Updated Date - 2020-04-05T01:42:32+05:30 IST