‘పది’ విద్యార్థుల నుంచి 196 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-06-07T10:26:14+05:30 IST

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేర కు ఇతర జిల్లాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు జిల్లా వి ద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు...

‘పది’ విద్యార్థుల నుంచి 196 దరఖాస్తులు

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 6: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేర కు ఇతర జిల్లాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు జిల్లా వి ద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో జిల్లా లో 196 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఇతర జిల్లాల్లో పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసేలా ఏర్పాటు చేసేందుకుగాను విద్యార్థుల నుంచి ద రఖాస్తులు స్వీకరించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎక్కువగా హైదరాబాద్‌ ప్రాంతంలోనే చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై ఉన్నతాఽధికారుల ఆదేశాల మే రకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఇతర జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఆ దేశాలు రాలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తామని తె లిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం పరీక్షలను మళ్లీ వాయిదా వేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-06-07T10:26:14+05:30 IST