18 నుంచి కారు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-01-14T05:29:15+05:30 IST

యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువ కులకు కారు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సంస్థ డైరెక్టర్‌ దిట్టకవి శ్రీనివాసాచార్యులు తెలిపారు.

18 నుంచి కారు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జనవరి 13 : యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ  యువ కులకు కారు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సంస్థ డైరెక్టర్‌ దిట్టకవి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈనెల 18 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని, 30 రోజుల పాటు శిక్షణ కాలం ఉంటుందని పదో తరగతి ఆపైన చదివిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వయోపరిమితి 19 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌లు, మూడు కలర్‌ ఫొటోలతో రావాలన్నారు. ఇతర వివరాలకు 08812–253975, 99485 65256, 95027 23561లో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-01-14T05:29:15+05:30 IST