18 సీసాల మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-16T05:16:39+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 18 సీసాల తమిళ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

18 సీసాల మద్యం పట్టివేత

తడ, జనవరి 15 : అక్రమంగా తరలిస్తున్న 18 సీసాల తమిళ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక బోడిలింగాలపాడు వద్ద ఎస్‌ఐ వేణు తనిఖీ చేస్తుండగా ఆరంబాకం నుంచి సూళ్లూరుపేట వైపు వెళ్తున్న బైక్‌ను ఆపేందుకు ప్రయత్నం చేశారు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఆందోళన చెందిన కిందపడిపోయాడు. దీంతో పోలీసులు అతని బైక్‌ను తనిఖీ చేయగా 18 సీసాల తమిళనాడు మద్యాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఆ  వ్యక్తి వాటంబేడు కుప్పం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-01-16T05:16:39+05:30 IST