ఢిల్లీ అల్లర్ల కేసులో 17 వేల పేజీల చార్జిషీటు

ABN , First Publish Date - 2020-09-17T08:13:15+05:30 IST

ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు 17,500 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు...

ఢిల్లీ అల్లర్ల కేసులో 17 వేల పేజీల చార్జిషీటు

  • సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్న 15 మంది పేర్లు నమోదు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు 17,500 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళనకారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆప్‌ బహిష్కృత కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌, పలువురు విద్యార్థులు సహా 15 మంది పేర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ 15 మందిని నిందితులుగా పేర్కొంటూ ఉగ్రవాద వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద చార్జిషీటు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, పోలీసులు బుధవారం సమర్పించిన  చార్జిషీట్‌లో ఉమర్‌ ఖలీద్‌, షర్జీల్‌ ఇమామ్‌ పేర్లను నమోదు చేయలేదు. పోలీసులు ఇప్పటికే వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-09-17T08:13:15+05:30 IST