ప్రజావాణి వాట్సాప్‌కు 16 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-08-04T11:05:18+05:30 IST

ప్రజావాణిలో భాగంగా సోమవారం వాట్సాప్‌ వీడియో కాల్‌కు పదహారు ఫిర్యాదులు వచ్చాయి.

ప్రజావాణి వాట్సాప్‌కు 16 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 3: ప్రజావాణిలో భాగంగా సోమవారం వాట్సాప్‌ వీడియో కాల్‌కు పదహారు ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అదనపు కలెక్టర్‌ సీతారామారావు నిర్వహించిన వాట్సాప్‌ వీడియో కాల్‌ నెంబర్‌కు హన్వాడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ (అర్బన్‌) నవాబ్‌పేట్‌, గండీడ్‌ మండలాల నుంచి 16 మంది తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుక వచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ సీతారామారావు మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.స్వర్ణలత, జీబీ సెల్‌ సూపరింటెండెంట్‌ శీనివాస్‌జ్యోషి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T11:05:18+05:30 IST