హత్యాయత్నం కేసులో 16 మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-06-15T04:54:08+05:30 IST

మూడవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఈనెల 10న మెట్టుపల్లి వేంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో 16 మంది యువకులను అరెస్టు చేసి వారి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు.

హత్యాయత్నం కేసులో 16 మంది అరెస్టు
పట్టుబడిన నిందితులతో డీఎస్పీ ప్రసాదరావు, సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 14 : మూడవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఈనెల 10న మెట్టుపల్లి వేంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో 16 మంది యువకులను అరెస్టు చేసి వారి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు  వెల్లడించారు. సోమవారం స్థానిక త్రీటౌ న్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో పొట్టిపాడురోడ్డులో అదే ప్రాంతానికి చెందిన మెట్టుపల్లి వేంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులను కొంతమంది యువకులు కట్టెలతో, రాళ్లతో తీవ్రంగా గాయపరిచి, చంపేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వేంకటేశ్వరరెడ్డి, మరో ఇద్దరికి గాయాలు కాగా, వేం కటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణ నేపఽథ్యంలో  సీఐ గంటా సుబ్బారావు, ఎస్‌ఐ రెడ్డి సురే్‌షలు వారి సిబ్బందితో కలిసి 16 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన వారిలో శ్రీనివాసనగర్‌కు చెందిన చెమ్మ ని అమీర్‌బాష, గద్దారపు మస్తాన్‌వల్లి, బాకరాపేటవీధికి చెందిన మార్తల గురురాజమోహన్‌రెడ్డి, అమృతానగర్‌కు చెందిన కాశారపు అశోక్‌, ఏకునామపేట వెంకట ప్రవీణ్‌, వివేకానందకాలనీకి చెందిన మట్టి వెంకటరెడ్డి, శ్రీనివాసనగర్‌కు చెందిన ప్రొద్దుటూరు చాంద్‌బాష, ముళ్లా మహబూబ్‌బాష, అమృతానగర్‌కు చెందిన అంగజాల ప్రవీణ్‌, కొత్తపల్లి గ్రామానికి చెందిన మేడిగ సుధీర్‌, తాళ్లమాపురం గ్రామానికి చెం దిన ఆరిగెల సునీల్‌, సుబ్బిరెడ్డికొట్టాలకు చెందిన తమతం పవన్‌కుమార్‌రెడ్డి, పట్నం పవన్‌కళ్యాణ్‌, అన్నవరం గ్రామానికి చెందిన తవ్వా భార్గవ్‌రెడ్డి, శ్రీనివాసనగర్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌ నూర్‌, షేక్‌ కమాల్‌బాషలు ఉన్నట్లు  తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంతోనే  కట్టెలు, రాళ్లతో చంపేందుకు యత్నించారని తెలిపారు. కాగా కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంతో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్‌ రిమాండుకు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ రెడ్డి సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T04:54:08+05:30 IST