15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

ABN , First Publish Date - 2020-07-11T09:57:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతలో రూ.26,89,47,388 విడుదల

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

జిల్లాకు 26.89 కోట్లు కేటాయింపు


(కడప-ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతలో రూ.26,89,47,388 విడుదల చేసింది. జనాభా, విస్తీర్ణత ఆధారంగా ఈ నిధులను జిల్లాలోని 707 గ్రామ పంచాయతీలకు అందించనున్నారు. అలాగే జిల్లా పరిషత్‌కు కూడా రూ.5,76,31, 553 విడుదల చేయడంతో నిధులు లేక నీరసిస్తున్న జిల్లా పరిషత్‌కు కాస్త ఊరట కలగనుంది. గతేడాది 14వ ఫైనాన్స్‌ నిధులను మార్చిలో మొదటి విడతలో రూ.44.13 కోట్లు, రెండో విడతలో రూ.59.39 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం 15వ ఆర్థిక సంఘం నిధులు తొలివిడత నిధులు మంజూరు కావడంతో పంచాయతీలో శానిటేషన్‌ తదితర అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. 

Updated Date - 2020-07-11T09:57:29+05:30 IST