ఒకే కిడ్నీలో 156 రాళ్లు..

ABN , First Publish Date - 2021-12-17T19:11:33+05:30 IST

కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేయగా

ఒకే కిడ్నీలో 156 రాళ్లు..

  • ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

హైదరాబాద్‌ సిటీ/కీసర : హుబ్లీకి చెందిన వ్యక్తి కిడ్నీలో 156 రాళ్లను ప్రీతి యురాలజీ కిడ్నీ ఆస్పత్రి వైద్యులు ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ద్వారా తొలగించారు. యురాలజిస్టు, ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ చంద్రమోహన్‌ గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉపాధ్యాయుడైన బసవరాజ్‌ మడివలార్‌(50)కు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేయగా కిడ్నీలో రాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. అతడికి మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ కడుపు దగ్గర ఉందని తెలిపారు. అలాగే కీసరలోని లైఫ్‌ సేవ్‌ ఆస్పత్రిలో యా దాద్రి జిల్లా యాదాద్రి మండలం బొమ్మలరామారం గ్రామానికి చెందిన బాలనర్సింహ కిడ్నీలోని వంద రాళ్లను వైద్యుడు శేఖర్‌ సాహూ లాప్రోస్కోపిక్‌ ద్వారా తొలగించారు.

Updated Date - 2021-12-17T19:11:33+05:30 IST