స్కూల్‌కని వెళ్లిన 15ఏళ్ల బాలిక తిరిగి రాలేదు.. ఆరా తీస్తే బయటపడ్డ షాకింగ్ విషయాలు.. ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం..

ABN , First Publish Date - 2022-04-15T16:19:52+05:30 IST

ఆ అమ్మాయికి 15ఏళ్లు. ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి రెడీ అయింది. బ్యాగు పట్టుకుని స్కూల్ వెళ్తున్నానంటూ ఇంట్లోంచి బయల్దేరింది. అయితే సాయంత్రం అయినా ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చే

స్కూల్‌కని వెళ్లిన 15ఏళ్ల బాలిక తిరిగి రాలేదు.. ఆరా తీస్తే బయటపడ్డ షాకింగ్ విషయాలు.. ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం..

ఇంటర్నెట్ డెస్క్: ఆ అమ్మాయికి 15ఏళ్లు. ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి రెడీ అయింది. బ్యాగు పట్టుకుని స్కూల్ వెళ్తున్నానంటూ ఇంట్లోంచి బయల్దేరింది. అయితే సాయంత్రం అయినా ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ టీనేజర్ కోసం స్కూల్‌లో ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో ఆమె అసలు స్కూల్‌కే రాలేదని సమాధానం రావడంతో కంగుతిన్నారు. వెంటనే యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కానీ వారి శ్రమ వృథా అయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన 15ఏళ్ల అమ్మాయి స్కూల్‌కి వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయటికొచ్చింది. అయితే ఆమె తిన్నగా స్కూల్‌కు వెళ్లకుండా ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఫ్రెండ్‌ను కలిసిందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్లింది. అయితే సాయంత్రం అయినా అమ్మాయి స్కూల్‌ నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆమె కోసం గాలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఆమె గ్వాలియర్ వెళ్లినట్టు గుర్తించారు. అనంతరం ఆమెను గ్వాలియర్ నుంచి రాజస్థాన్ తీసుకొచ్చారు. బస్సుకు టికెట్‌కు కూడా డబ్బులు లేనప్పటికీ ఫ్రెండ్ సహాయంతోనే ఆమె గ్వాలియర్ వెళ్లినట్టు విచారణ సందర్భంగా ఆమె వెల్లడించింది. అంతేకాకుండా తన ఫ్రెండ్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినట్టు పేర్కొంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-04-15T16:19:52+05:30 IST