15 అడుగుల విచిత్ర జలచరం.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2020-08-05T02:12:26+05:30 IST

భూమిపై మనిషికి తెలియని వింతలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఇప్పటికీ దాగున్నాయనేది...

15 అడుగుల విచిత్ర జలచరం.. వైరల్ అవుతున్న ఫోటోలు

లండన్: భూమిపై మనిషికి తెలియని వింతలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఇప్పటికీ దాగున్నాయనేది జగమెరిగిన సత్యం. అందులో ఒకటి ఇటీవ ఇంగ్లాండ్‌లో బయటపడింది. ఇప్పటికే సముద్రంలో అనేక జీవజాతులను, క్రిమికీటకాలను కనుగొన్న శాస్త్రవేత్తల మేధస్సుకు మరొక చిక్కు ప్రశ్న ఎదురైంది. దాదాపు 15 అడుగుల పొడవున్న ఓ విచిత్రమైన జలచరం లివర్ ప్రాంతంలోని మెర్సీసైడ్ బీచ్‌కు కొట్టుకొచ్చింది. దానిని చూసిన ప్రజలు అది ఏ జాతికి చెందిందో అంతుబట్టకుండా ఉందని, తల లేకపోవడం, పూర్తిగా కుళ్లిపోవడంతో దాని గురించి చెప్పడం కష్టమవుతోందని అంటున్నారు. బీచ్ కాపలా వ్యక్తి మాట్లాడుతూ, నీటిలో ఈత కొట్టేందుకు అనువైన పాదాలు, శరీరం నిండా జూలు ఉన్నాయని, కానీ అదేంటి అనే విషయం మాత్రం అంతుబట్టకుండా ఉందని తెలిపాడు. అయితే కొన్ని రకాల జీవులను ఒకటిగా కలిపితే ఎలా ఉంటుందో ఈ జలచరం అలా ఉందని చెబుతున్నాడు. దీనిని ఫోటోలు తీసిన ప్రజలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-08-05T02:12:26+05:30 IST