రూ.15 లక్షల విలువైన 500 రూపాయల నోట్ల కట్టల్ని పెట్టెలో పెడితే జరిగింది ఇదీ.. సగం కాలిపోయిన స్థితిలో..

ABN , First Publish Date - 2022-06-10T18:15:16+05:30 IST

అతను ఒక రైతు.. కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు.. రాత్రనకా పగలనకా కష్టపడి వ్యవసాయం చేసి రూ.15 లక్షలు, కొంత బంగారం సంపాదించాడు..

రూ.15 లక్షల విలువైన 500 రూపాయల నోట్ల కట్టల్ని పెట్టెలో పెడితే జరిగింది ఇదీ.. సగం కాలిపోయిన స్థితిలో..

అతను ఒక రైతు.. కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు.. రాత్రనకా పగలనకా కష్టపడి వ్యవసాయం చేసి రూ.15 లక్షలు, కొంత బంగారం సంపాదించాడు.. వాటిని తన ఇంట్లోనే ఓ పెట్టెలో పెట్టి దాచుకున్నాడు.. బుధవారం రాత్రి అతను నివస్తున్న పూరి గుడిసెకు నిప్పంటుకుంది.. ఆ ప్రమాదంలో అతని కష్టార్జితమంతా అగ్గిపాలైంది.. అతనికి కలిగిన నష్టం రూ.42.75 లక్షలని అధికారులు అంచనా వేశారు.. ఇప్పటివరకు కష్టపడి సంపాదించినదంతా పోవడంతో అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. 


ఇది కూడా చదవండి..

PUBG ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం.. 10 గంటల పాటు ఆమె కొనఊపిరితో ఉన్నా..


రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన హనుమాన్ సింగ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. భార్య, భర్త కలిసి కష్టపడి కొంత డబ్బు, బంగారం సంపాదించుకున్నారు. రూ.15 లక్షల విలువైన నోట్ల కట్టలను, రూ.18 లక్షల విలువైన బంగారాన్ని ఓ పెట్టలో పెట్టి తమ గుడిసెలో దాచుకున్నారు. బుధవారం రాత్రి ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని ఐదు గుడిసెలకు నిప్పంటుకుంది. అందులో హనుమాన్ సింగ్ గుడిసె కూడా ఉంది. గుడిసెలో ఉన్న ఆ పెట్టె కూడా కాలిపోయింది. మొత్తం నోట్లన్నీ సగం వరకు కాలిపోయాయి. 


డబ్బులు, బంగారంతో పాటు రూ.4 లక్షల విలువైన ధాన్యం, ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి. కాలిపోయిన వాటి మొత్తం విలువ రూ.42.75 లక్షలని అధికారులు అంచనా వేశారు. హనుమాన్ సింగ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్ నమోదైతే ఆర్బీఐ నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. కాలిపోయిన నోట్ల విలువలో 25 నుంచి 50 శాతం వరకు ఆర్బీఐ రిఫండ్ చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-06-10T18:15:16+05:30 IST