15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

ABN , First Publish Date - 2021-02-28T05:32:28+05:30 IST

జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జీవో జారీ చేశారు.

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

  1. జిల్లాకు రూ.54.28 కోట్లు కేటాయింపు


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 27: జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జీవో జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. 973 గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 15 శాతం, జిల్లా ప్రజా పరిషత్‌లకు మరో 15 శాతం నిధులను కేటాయించారు. 973 పంచాయతీలకు రూ. 37,99,81,900 కేటాయించగా, మండ పరిషత్‌లకు రూ. 8,14,24,700, జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.8,14,24,700 ఇచ్చారు. మొత్తం రూ.54,28,31,300 జిల్లాకు కేటాయించారని డీపీవో కేఎల్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. జనాభా ఆధారంగా నిధులను గ్రామపంచాయతీలకు కేటాయిస్తామన్నారు. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన, తాగునీటి, విద్యుత్‌, రోడ్డు నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపడతామన్నారు

Updated Date - 2021-02-28T05:32:28+05:30 IST