ఎదురింటి అబ్బాయితో కలిసి 14 ఏళ్ల పిల్లాడి మాస్టర్ ప్లాన్.. నిజం తెలిసి నోరెళ్లబెట్టిన కుటుంబం!

ABN , First Publish Date - 2021-07-22T23:45:19+05:30 IST

పద్నాలుగేళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? సినిమాలు చూస్తాడు, గేమ్స్ ఆడతాడు, ఇంట్లో అమ్మానాన్నలపై చిన్న విషయాలకే విసుక్కుంటాడు.

ఎదురింటి అబ్బాయితో కలిసి 14 ఏళ్ల పిల్లాడి మాస్టర్ ప్లాన్.. నిజం తెలిసి నోరెళ్లబెట్టిన కుటుంబం!

ఇంటర్నెట్ డెస్క్: పద్నాలుగేళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? సినిమాలు చూస్తాడు, గేమ్స్ ఆడతాడు, ఇంట్లో అమ్మానాన్నలపై చిన్న విషయాలకే విసుక్కుంటాడు. ఇవే మనకు తెలిసింది. కానీ ఆ పిల్లాడు మామూలోడు కాదు. పద్నాలుగేళ్లకే ముదిరిపోయాడు. తన కన్నా వయసులో పెద్దవాడైన పొరుగింటి కుర్రాడిని కూడా తన పథకంలో భాగం చేశాడు. ఆ తర్వాత తన చినతాత ఇంటికి కన్నం వేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.30 లక్షలకు కాజేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నిమ్మకుండిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో వెలుగు చూసింది.


స్థానికంగా ఉండే ఉమర్ ఖాన్ అనే వ్యక్తి తన పొలం అమ్మి రూ.30 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు. జూలై 16న ఆయన ఇంట్లో లేనప్పుడు 14 ఏళ్ల మనుమడు, తన మిత్రుడితో కలిసి తాతయ్య ఇంట్లో ప్రవేశించాడు. అక్కడున్న ఇనప్పెట్టె తాళం పగలగొట్టి 30 లక్షల రూపాయలు కాజేశాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత జరిగిన దొంగతనం ఉమర్‌కు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 19 ఏళ్ల సాహుబుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. ఈ దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేసింది ఉమర్ మనుమడు కిశోర్ అని తేలింది. దీంతో ఆ కుటుంబం దిమ్మతిరిగిపోయింది. దొంగతనం జరిగిన రోజే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వీళ్లిద్దరూ ఈ డబ్బును ఖర్చు చేయలేకపోయారు. దీంతో వీరిద్దరి దగ్గర నుంచి మొత్తం రూ.27 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-07-22T23:45:19+05:30 IST