13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి 57 దుంగలు, లారీ, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌



 57 దుంగలు, లారీ, గొడ్డళ్లు స్వాధీనం  ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌


కడప (క్రైం), జూన్‌ 21: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి 57 దుంగలు, లారీ, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో సోమవారం ఓఎస్డీ దేవప్రసాద్‌, మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌, రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌తో కలిసి ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి స్మగ్లర్ల వివరాలు వెల్లడించారు. రాయచోటి పట్టణం వీరబల్లె మండలంలో డీఎస్పీ వాసుదేవన్‌ ఆధ్వర్యంలో సీఐ లింగప్ప, ఎస్‌ఐ మహ్మద్‌రఫీ తమ సిబ్బందితో మాధవాండ్లపల్లె  వద్ద నిఘా ఉంచి వాహనాలు తనిఖీ చేశారన్నారు. అటువైపు వస్తున్న లారీని తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్మగ్లర్లు దాడులు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పీడీ యాక్టు కేసుల్లో అరెస్టయిన చమర్తి అమరేంద్రరాజు, మూడె మల్లికార్జున్‌నాయక్‌ అలియా స్‌చందునాయక్‌లు బెంగుళూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లరు నజీర్‌తో సంబంధాలు సాగిస్తూ దుంగలను వాహనాల్లో కర్ణాటక తోలుతూ పట్టుబడినట్లు తెలిపారు. వీరితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 45 ఎర్రచందనం దుంగలు, లారీ, ఒక గొడ్డలి, మచ్చుకత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారితో పాటు బుక్కె సుబ్రమణ్యంనాయక్‌ అలియాస్‌ సోమునాయక్‌, బుక్కే నాగరాజునాయక్‌, వర్ల ఆంజనేయులు దుద్యాల వెంకట్రమణ అలియాస్‌ చాకలి అశోక్‌ అలియాస్‌ బాబు ఉన్నారన్నారు.

పోరుమామిళ్ల పరిధిలో...

పోరుమామిళ్ల పరిధిలోని ఇసుకపల్లె గ్రామ సమీపంలో మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్‌ సిబ్బందితో అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా వారికి తారసపడిన ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17 దుంగలు, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు కూడా ఎర్రచందనం దుంగలను కర్నాటక తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. గోపవరం మండలం కలువపల్లె గ్రామం యానాదికాలనీకి చెందిన వేముల వెంగయ్య, వల్లెం రవి, కొత్తూరు ఆదినారాయణ, చెరుకూరి వెంకట్రమణ, ఓరుగంటి అరవయ్య అరెస్టు అయిన వారిలో ఉన్నారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐలు లింగప్ప, పుల్లయ్య, ఎస్‌ఐలు హరిప్రసాద్‌, మహ్మద్‌ రఫీ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST