మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే 12,712 కేసులు

ABN , First Publish Date - 2020-08-13T02:30:37+05:30 IST

మహారాష్ట్రలో కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా నమోదవుతున్న కేసులు రోజుకో...

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే 12,712 కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా నమోదవుతున్న కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మహారాష్ట్రలో కొత్తగా 12,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,313కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,513.


కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం రేపుతోంది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 344 మంది కరోనాతో మరణించారు. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 18,650కి చేరింది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 13,408 మంది కరోనా నుంచి కోలుకున్నారు.




Updated Date - 2020-08-13T02:30:37+05:30 IST