కేరళలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... గడచిన 24 గంటల్లో...
ABN , First Publish Date - 2021-07-03T11:55:28+05:30 IST
కేరళలో గడచిన 24 గంటల్లో కొత్తగా...
తిరువనంతపురం: కేరళలో గడచిన 24 గంటల్లో కొత్తగా 12,095 మందికి కరోనా సంక్రమించింది. దీంతో కేరళలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,49,128కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 146 మంది కన్నుమూశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,505కు చేరింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 10,243 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య28,31,394కు చేరింది. ప్రస్తుతం 1,03,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో మొత్తం 1,19,659 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 10.11 శాతంగా ఉంది.