Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామాభివృద్ధి కోసం ఆ చిట్టితల్లి ఏం చేసిందంటే...

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మటియాలా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఘుల్ఘులీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి మిలన్ యాదవ్ తమ ప్రాంత అభివృద్ధి కోసం తపిస్తోంది. ఇందుకోసం మిలన్ తమ గ్రామంలో నెలకొన్ని సమస్యలను సమగ్రంగా వివరిస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసింది. ఎనిమిది పేజీలున్న ఈ లేఖలో గ్రామంలోని సమస్యలను వివరించడంతోపాటు, వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా పంపింది. 

స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఆ చిన్నారి అక్కడి అధికారులను సంప్రదించి పలు సమస్యలను తెలుసుకుంది. ఈ పనులలో ఆమెకు ఆమె తాత సాయం అందించారు. మిలన్ ప్రధానికి రాసిన లేఖలో గ్రామంలో పరిశుధ్య వ్యవస్థ సరిగా లేదని, క్రీడాకారులకు మైదానం లేదని తెలియజేసింది. తమ గ్రామంలోని సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆ చిన్నారి కోరింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement