దాచుకున్న డబ్బుతో వలస కార్మికులకు విమాన టికెట్లు.. 12 ఏళ్ల బాలిక పెద్ద మనసు

ABN , First Publish Date - 2020-06-02T00:00:04+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ఈ తరుణంలోనే మనుషుల్లోని మానవత్వం కూడా పరిమళిస్తోంది. నిలువనీడ కరువై ఆకలితో...

దాచుకున్న డబ్బుతో వలస కార్మికులకు విమాన టికెట్లు.. 12 ఏళ్ల బాలిక పెద్ద మనసు

లక్నో: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ఈ తరుణంలోనే మనుషుల్లోని మానవత్వం కూడా పరిమళిస్తోంది. నిలువనీడ కరువై ఆకలితో అలమటిస్తున్న అనేకమందికి మేమున్నామంటూ కొందరు చేయూతనందిస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది వీరిలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ 12ఏళ్ల బాలిక కూడా ఈ జాబితాలో చేరింది. నోయిడాలో నివశించే నిహారికా ద్వివేదీ వలస కార్మికుల దీనావస్థ చూసి కలత చెందింది. వారికి ఎలాగైనా సాయం చేయాలని అనుకుంది. తాను ఎప్పటినుంచో దాచుకున్న  డబ్బులతో ఓ ముగ్గురు వలస కార్మికులకు విమాన టిక్కెట్లు కొని అందజేసింది. దాదాపు రూ.48వేల రూపాయలు ఖర్చు చేసి వారిని ఇంటికి పంపించింది.


ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, సమాజం మనంకెంతో ఇచ్చిందని, ఇప్పుడు మనం తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గొప్పగా చెప్పుకొచ్చింది. కూతురు చేసిన సాయంపై నిహారిక తల్లి స్పందిస్తూ, టీవీలో వలస కార్మికుల దుస్థితిని చూసి నిహారిక ఎప్పుడూ చలించిపోయేదని, వారికి ఎలాగోలా సాయం చేయాలనుకునేదని చెప్పుకొచ్చారు. ఆమె చేసిన ఈ సాయంపై తాము ఎంతో గర్వంగా ఉన్నామని చెప్పారు.

Updated Date - 2020-06-02T00:00:04+05:30 IST