Abn logo
Sep 18 2021 @ 00:11AM

గణపతికి 116 కేజీల లడ్డూ

గణనాథుని వద్ద నివేదనగా పెట్టిన 116 కేజీల లడ్డూ

జలుమూరు: శ్రీముఖలింగం వెలమ వీధిలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకునికి అనంత పాడి 116 కేజీలు లడ్డును ప్రసాదంగా సమర్పించారు. స్వామి నిమజ్జనం రోజున లడ్డూ ప్రసాదం వేలం వేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.  విశేష పూజలు చేశారు.  


సహస్ర నామార్చన

 నందిగాం: నందిగాం కారిగుడ్డి వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సహస్రనామార్చనను నిర్వహించారు. పురోహితులు ఎం.రమేష్‌శర్మ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విశేష అర్చనలు చేశారు.  శివరాంపురంలో గణపతి వద్ద ఏర్పాటుచేసిన లడ్డూను వేలం వేయగా అదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య రూ.38,500లకు దక్కించుకున్నారు.