వర్షాకాలంలో 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-08-12T05:21:17+05:30 IST

వర్షాకాలంలో గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాన బారిన పడి 108కి ఫోనే చేస్తే సిబ్బంది సకాలంలో రోగుల వద్దకు చేరి వారికి ప్రథమ చికిత్సలు అందించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌ అన్నారు.

వర్షాకాలంలో 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ఉట్నూర్‌రూరల్‌, ఆగస్టు 11 : వర్షాకాలంలో గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాన బారిన పడి 108కి ఫోనే చేస్తే సిబ్బంది సకాలంలో రోగుల వద్దకు చేరి వారికి ప్రథమ చికిత్సలు అందించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌ అన్నారు. గురువారం స్థానిక 108 కార్యాలయాన్ని నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలలో ఉద్యోగులు పాటించాల్సిన నియమనిబందనల గురించి వివరిస్తూ అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థిల్లో 108 వాహనాలను, గర్భిణులకునెలసరి వైద్యపరీక్షల కోసం 102 వాహనాలను వినియోగించుకోవాలన్నారు.   అంతకు ముందు 108, 102 వాహనాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ డివిజన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆపరేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ కోండల్‌రావు, ఆదిలాబాద్‌ ఈఎంఈ విజ్ఞేశ్వర్‌, 108 సిబ్బంది శంకర్‌, గణేష్‌, దత్తు, అంజద్‌, సాయినాథ్‌, శ్రావంతి, అనిత,కైలాస్‌, పాయిలెట్స్‌ దరంసింగ్‌, బాపురావు, నాందేవ్‌, సచిన్‌, రాజేశ్వర్‌, సుందర్‌సింగ్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:21:17+05:30 IST