మా పొట్ట కొట్టొద్దు

ABN , First Publish Date - 2020-07-04T10:07:25+05:30 IST

కొత్త వాహనాలు తెచ్చామని సంబరాలు చేస్తూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి మా పొట్ట కొడతారా అంటూ 104 ఉద్యోగులు ప్రభుత్వంపై మం

మా పొట్ట కొట్టొద్దు

కలెక్టరేట్‌ ఎదుట 104 ఉద్యోగుల నిరసన


అనంతపురం వైద్యం, జూలై 3: కొత్త వాహనాలు తెచ్చామని సంబరాలు చేస్తూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి మా పొట్ట కొడతారా అంటూ 104 ఉద్యోగులు ప్రభుత్వంపై మం డిపడ్డారు. న్యాయం చేయాలంటూ శుక్రవారం జిల్లా లోని 104 ఉద్యోగులు నిరసనకు దిగారు. కలెక్టరేట్‌ ఎదుట  గంటకుపైగా ఆందోళన చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ 104 సేవలకు కొత్త వాహనాలు వచ్చాయని ఆనందపడ్డాం. అయితే మా ఉద్యోగాలు పీకేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


104 వాహనంలో డ్రైవర్‌ను మాత్రమే పె ట్టుకుని ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌, స్టాఫ్‌నర్సు, ఏఎ న్‌ఎం, వాచ్‌మెన్‌లను తొలగించారన్నారు. దీంతో మా కు టుంబాలు వీధిన పడాల్సి వచ్చిందని వాపోయారు. ప్రస్తు తం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారని అందులో తొ లి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేయా లని డిమాండ్‌ చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో 104 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌ స్వప్న, కార్యదర్శి శివకృష్ణ, సహాయ కార్యదర్శి హుస్సేన్‌, సభ్యులు రాజేష్‌, యశోద, రాజేష్‌నాయక్‌, మంజునాథ్‌, నారాయణస్వామి, అశ్వత్థ, జయ కుమార్‌, ఆదిమూర్తి పలువురు 104 ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-04T10:07:25+05:30 IST