ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు
చంద్రగిరి, నవంబరు 30: పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఇందులో విప్రో సంస్థకు 103 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్ కిలారి మంగళవారం తెలిపారు. 105 మంది విద్యార్థులలో సీఎ్‌సఈ విభాగంలో 44 మంది, ఈసీఈ విభాగంలో 41 మంది, ఈఈఈ విభాగంలో 15 మంది, మెకానికల్ విభాగంలో ముగ్గురు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తొలి సంవత్సరం నుంచి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచేలా తర్ఫీదు ఇవ్వడమే దీనికి కారణమన్నారు. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ చూపి ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ చంద్రశేఖర్‌నాయుడు అభినందించారు.