మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా

ABN , First Publish Date - 2020-04-10T17:20:56+05:30 IST

ఉదయం 6-9 గంటల మధ్య నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించ డం జరుగుతుందని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌

మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఉదయం 6-9 గంటల మధ్య నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం నుంచి నిబంధనలు మరింత కఠిన తరం చేస్తామన్నారు. సాధారణ అనారోగ్యానికి ప్రజలు ఫోన్‌ ద్వారా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపి, కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేయించు కోవడానికి వారికిచ్చిన ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆసుపత్రుల కు వెళ్లాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటల లోపు కార్యాలయాలకు చేరుకోవాలని, సాయంత్రం 5 నుంచి ఏడు గంటల లోపు ఇంటికి వెళ్లిపోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు చూపించి కలెక్టరేట్‌లో పాసులు పొందవచ్చన్నారు. ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్‌ని ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ అందించే ముందస్తు జాగ్రత్త చర్యలు తెలుసుకోవాలన్నారు. 

Updated Date - 2020-04-10T17:20:56+05:30 IST