Wah Taj: ప్లాస్టిక్ కాలుష్యం నిన్న-నేడు.. ఫోటోలు షేర్ చేసిన చిన్నారి Licypriya

ABN , First Publish Date - 2022-07-03T02:40:42+05:30 IST

మణిపూర్ చిన్నారి, సామాజిక కార్యకర్త లిచిప్రియ కన్‌గుజమ్ (Licypriya kangujam) మరోసారి అందరి ..

Wah Taj: ప్లాస్టిక్ కాలుష్యం నిన్న-నేడు.. ఫోటోలు షేర్ చేసిన చిన్నారి Licypriya

లక్నో: మణిపూర్ చిన్నారి, సామాజిక కార్యకర్త లిచిప్రియ కన్‌గుజమ్ (Licypriya kangujam) మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ''మార్పు కోసం నువ్వు పడుతున్న కష్టం శ్లాఘనీయం'' అంటూ ట్విట్టర్ యూజర్లు  లిచిప్రియను అభినందనలతో ముంచెత్తుతున్నారు. పది రోజుల క్రితం... పదేళ్ల లిచిప్రియ తాజ్‌మహల్ చుట్టుపక్కల ప్లాస్టిక్ కాలుష్యంపై ఒక ట్వీట్ చేయడంతో పాటు అక్కడ పడేసిన వ్యర్థపదార్ధాల ఫోటోను షేర్ చేసింది. తాజాగా ఆమె... ఇప్పుడు చూడండి అన్నట్టుగా....తాజ్ మహల్ చుట్టూ ఇంతకుముందు పేరుకుపోయిన వ్యర్థపదార్ధాల ఫోటోను, ప్రస్తుతం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించిన ఫోటోను షేర్ చేసింది. కేవలం వారం, పది రోజుల్లోనే అక్కడి వ్యర్థపదార్ధాలు కనుమరుగై పరిశుభ్ర వాతావరణం ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. అంతే...ట్విటర్ యూజర్లు చిన్నారి లిచీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


''గుర్తుపట్టలేనంతంగా మార్పు కనిపిస్తోంది. నువ్వు తీసుకున్న చొరవ శ్లాఘనీయం" అంటూ ఒకరు అభినందించారు."అభినందనలు...నువ్వు మార్పు తీసుకువచ్చావు'' అని మరొకరు అభినందించారు. సరిగ్గా పదిరోజుల క్రితమే లిచిప్రియ ఒక ట్వీట్‌లో ''తాజ్‌మహల్ అందం వెనుక ఈ ప్లాస్టిక్ కాలుష్యం చూడండి'' అంటూ ఓ ప్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోటో షేర్ చేసింది. ''తాజ్‌మహల్‌ను మీరు సందర్శించినప్పుడు ఈ సన్నివేశం మీకు కనిపించవచ్చు. ఎంత కాలుష్యం పేరుకుపోయిందోనని మీరు అనొచ్చు. కానీ, మీరు పడేసే ఒక పోలిథిన్ బ్యాగ్, ఒక సింపుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిలే ఈ పరిస్థితికి కారణం. లక్షలాది ప్రజలు ఏటా ఇక్కడకు వస్తుంటారు'' అని ట్వీట్ చేసింది. తాజాగా...లిచిప్రియ...''బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీన్'' అంటూ రెండు ఫోటోలు షేర్ చేసింది. మొదటి ఫోటోలో ఈ పరిస్థితి చూడండన్నట్టు విచారంగా కనిపించిన లిచీ...రెండో ఫోటోలో ఇప్పుడు ఎంత పరిశుభ్రంగా పరిసరాలు ఉన్నాయో చూడండంటూ చిరునవ్వుతూ విక్టరీ సంకేతం చూపించింది. దీంతో లిచీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-07-03T02:40:42+05:30 IST