Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడ్లూరు వైద్యశాలలో ముగిసిన కేంద్ర బృందం తనిఖీ

 గుడ్లూరు, అక్టోబరు : గుడ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండురోజుల పాటు కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఈ మేరకు కేంద్ర బృందం సభ్యులు ప్రమోద్‌మిస్రా, సంజీవ్‌లు తెలిపిన వివరాల ప్రకారం..  స్థానిక వైద్యశాలలో అన్నిరకాల ప్రభుత్వ వైద్య విధానాల తీరుతెన్నలగురించి పారదర్శకంగా రెండురోజుల పాటు పరిశీలించినట్లు తెలిపారు.  వైద్యశాలలో ఓపీలు, నాణ్యమైన వైద్యసేవలవరకు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా..? లేదా..? అని పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం మందుల రికార్డులు పరిశీలించారు. ఇన్‌పేషెంట్‌ సేవలు, లేబరేటరీ సేవలు, కాన్పుల విభాగంలో పనితీరును అంచనావేసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి మారుతీరావు, అదనపు ఎంవో నాగమణి, జరుగుమల్లి డాక్టర్‌ రాజ్యలక్ష్మీ. ఇతర వైద్యసిబ్బంది ఎ.ఎన్‌.ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

పీసీపల్లి : స్థానిక ప్రాథమిక వైద్యశాలలో కేంద్ర బృందం మంగళవారం కూడా తనిఖీ చేశారు. ఆస్పపత్రిలోని పరికరాలు, మందులు రోగులకు అందుతున్న సేవల గురించి ఆరాతీశారు. వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. వైద్యశాలలోని పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న వైద్యసేవల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు హెచ్‌ఈఓ బేగ్‌ తెలిపారు. ఈ బృందంలో డాక్టర్‌ సీమా మురళీ, డాక్టర్‌ రేష్మాఠాకూర్‌, జిల్లా క్వాలిటీ మేనేజర్‌ స్టీఫెన్‌, స్ధానిక వైద్యాధికారిణి సుజన తదితరులు ఉన్నారు.


Advertisement
Advertisement