అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-08-17T04:50:41+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం అని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీ పీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
చక్రాయపాలెంలో సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేస్తున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

అద్దంకిటౌన్‌, ఆగస్టు 16: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం అని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీ పీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం మండ లంలోని చక్రాయపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామం లో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నింటిని అమలు చేస్తున్నా రన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా వంటి నవరత్నాల ద్వారా ప్రజలుకు పథకాలను అందజేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ గోగులమూడి నగేష్‌, ఎంపీడీవో ఏ.రాజేందర్‌, పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు జ్యోతి హనుమంతరావు, ఏ.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు

చినగంజాం, ఆగస్టు 16: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసీపీ పర్చూరు ని యోజకవర్గ ఇన్‌చా ర్జి రావి రామనాథం బాబు అన్నారు. మండలంలోని పల్లె పాలెం గ్రామంలో మంగ ళవారం నిర్వ హించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ఆయన వివరించి కరపత్రాలను అందజేశారు. పల్లెపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, తూర్పు పల్లెపాలెం, పడ మర పల్లెపాలెం, బాపయ్యనగర్‌ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, కొత్తపాలెం, పల్లెపా లెం సర్పంచ్‌లు ఆసోది బ్రహ్మారెడ్డి, సైకం మణి, తహసీల్దార్‌ పి.పార్వతి, ఎంపీడీవో డి.విజయలక్ష్మి, ఈవోపీఆర్డీ కె.స్వరూపరాణి, ఏఈ లు డి.దాసు, రాజశేఖర్‌, ఏపీఎం వి.లాజర్‌, పలు శాఖలకు చెందిన అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చీరాల, ఆగస్టు 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. స్ధానిక విఠల్‌నగర్‌ 26వ వార్డులో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలసి వెంకటేష్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తి రుగుతూ ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల ఫలా లు, అభివృద్ధి పనులను వివరిస్తూ, స్థానికంగా ఇంకా ఏమన్నా సమ స్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చే శారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కీర్తి వెంకట్రావు, అగస్టీన్‌, దేవరపల్లి బాబురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T04:50:41+05:30 IST