• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు

ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు

చలో గజ్వేల్‌కు పిలుపునిచ్చిన బీజేపీ నేతలను కామారెడ్డి పోలీసులు గురువారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెంకటరమణారెడ్డితో పాటు మరో నలుగురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బాన్సువాడ డివిజన్‌ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. దీంతో కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆశావర్కర్ల ఆశలు తీరేనా?

ఆశావర్కర్ల ఆశలు తీరేనా?

మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు చిన్నారుల వరకు టీకాలు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం.. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బాధితుల వివరాలను, క్షయ బాధితుల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడడం ఇలా ఒక్కటేమిటీ వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఆశా కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకాలు, వ్యాక్సిన్‌లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది.

MLC Kavitha: కేసీఆర్ నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం

MLC Kavitha: కేసీఆర్ నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం

సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు.

Shabbir Ali: కవిత మీ కుటుంబంతో కర్ణాటకకు రండి

Shabbir Ali: కవిత మీ కుటుంబంతో కర్ణాటకకు రండి

కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.

కాంగ్రెస్‌లో టికెట్‌ ఉత్కంఠ

కాంగ్రెస్‌లో టికెట్‌ ఉత్కంఠ

అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనేది తేలింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌లు ఎవరిని వరించనున్నాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టికెట్‌లకై కాంగ్రెస్‌ పెద్దలు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 21 మందికి పైగా కాంగ్రెస్‌ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

పాఠశాలలకు రక్షణ కరువు

పాఠశాలలకు రక్షణ కరువు

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే పాఠశాలలు కొందరు ఆకతాయిలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చోని తాగితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే పోలీసులు కేసులు పెడతారని ఆలోచన చేస్తు పాఠశాలలనే మద్యం తాగడానికి ఆవాసాలుగా చేసుకుంటున్నారు.

Kavitha: 119 సీట్లలో 100 పైగా సీట్లు గెలుస్తాం

Kavitha: 119 సీట్లలో 100 పైగా సీట్లు గెలుస్తాం

ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

నిరుద్యోగుల్లో ఆశలు

నిరుద్యోగుల్లో ఆశలు

ఎన్నికల వేళ యువత ఓట్లు రాబటేందుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో మాదిరిగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు.

ఢీకొనేదెవరో?

ఢీకొనేదెవరో?

కామారెడ్డి జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంటుంది. కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచేదేవరో.. గట్టిపోటీనిచ్చేదెవరోననే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

కామారెడ్డిపైనే ప్రతిపక్షాల ఫోకస్‌

కామారెడ్డిపైనే ప్రతిపక్షాల ఫోకస్‌

కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేయనున్నందున అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కామారెడ్డిపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డికి వెళ్తున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ముమ్మరం చేశాయి. కామారెడ్డిలోనూ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండడం స్థానిక ప్రజల్లో ఆ పార్టీకి ఆ స్థాయి మద్దతు లేకపోవడంతో కేసీఆర్‌ను ఢీకొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి