సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
HARISH RAO: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
KCR: రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
మెదక్ జిల్లా వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో చిరుత తీవ్రంగా గాయపడింది. అనంతరం రోడ్డుపక్కకు వెళ్లిపోయింది.
Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతోన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తడి బట్టలతో కురుమూర్తి ఆలయానికి రావాలంటూ ఆయనకు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు.
Patancheru Congress: పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను సర్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.
Congress Leaders: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పటాన్ చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నేతలు నినాదాలు చేశారు.
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు.