• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

TS Results: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

TS Results: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ ( DGP Anjani Kumar )పై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ డీజీపీని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

KCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

KCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

MLC Kavitha: కాంగ్రెస్ గెలుపుపై కవిత రియాక్షన్ ఇదే..

MLC Kavitha: కాంగ్రెస్ గెలుపుపై కవిత రియాక్షన్ ఇదే..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.

TS Result: గోషామహాల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం

TS Result: గోషామహాల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ ( Goshamahal ) నియోజకవర్గం నుంచి బీజేపీ ( BJP ) అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తర్వాత రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు.

Telangana Results : వావ్.. వివేక్.. అదరగొట్టేశారుగా!

Telangana Results : వావ్.. వివేక్.. అదరగొట్టేశారుగా!

చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఊహించిన విధంగానే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘనవిజయం సాధించారు.

Telangana Results: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

Telangana Results: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. పలువురు అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.

Telangana Results: భువనగిరిలో చరిత్ర తిరగరాసిన కాంగ్రెస్

Telangana Results: భువనగిరిలో చరిత్ర తిరగరాసిన కాంగ్రెస్

Telangana Results: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్.. ఈసారి పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు.

Kodandaram: కాంగ్రెస్ విజయంపై కోదండరాం హర్షం

Kodandaram: కాంగ్రెస్ విజయంపై కోదండరాం హర్షం

Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ ముందున్న గన్ పార్క్‌‌కు కోదండరాం చేరుకున్నారు.

Telangana Results: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు

Telangana Results: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు

Telangana Results: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంబం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌లో కుందూరు జైవీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామెల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవనున్నారు. అనీల్ కుమార్ రెడ్డి మినహా కొత్త అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలోకి దింపి విజయం సాధించింది.

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ హవా... గెలుపొందిన అభ్యర్థులు వీరే

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ హవా... గెలుపొందిన అభ్యర్థులు వీరే

Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజార్టీ కనబడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి